గురునానక్ జయంతి వేడుకల్లో సీఎం వైయస్ జగన్
30 Nov, 2020 19:26 IST
విజయవాడ: గురునానక్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో గురునానక్ 551వ జయంతి వేడుకలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ వేడుకల్లో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని ఆవినాష్, నగర అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ పాల్గొన్నారు.