క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్
25 Dec, 2020 10:20 IST
వైయస్‌ఆర్ జిల్లా: పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. చర్చిలో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. అనంతరం సీఎం వైయస్ జగన్, వైయస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను వైయస్ విజయమ్మ, సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎంలు అంజాద్‌బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ భాకరాపురం హెలిప్యాడ్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి బయల్దేరి వెళతారు.