మహాత్మా గాంధీకి సీఎం వైయస్ జగన్ ఘన నివాళి
30 Jan, 2024 11:01 IST
తాడేపల్లి : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి సీఎం వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.