టంగుటూరికి సీఎం వైయస్ జగన్ నివాళి
23 Aug, 2023 11:08 IST
తాడేపల్లి: స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి సీఎం వైయస్ జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.