పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం
16 Mar, 2020 12:43 IST
తాడేపల్లి: అమర జీవి పొట్టి శ్రీరాములు సేవల్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్మరించుకొన్నారు. అమరజీవి జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.