అంబటి అనిల్ మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం
23 Oct, 2021 11:57 IST
తాడేపల్లి: విజయనగరం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ అంబటి అనిల్ గుండెపోటుతో మృతిచెందారు. అనిల్ మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనిల్ మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.