పిచ్చిరెడ్డి మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం
14 Oct, 2021 15:47 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దర్శి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతున్న పిచ్చిరెడ్డి గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.