చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలి
17 Feb, 2020 11:58 IST
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఇవాళ కేసీఆర్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా కేసీఆర్‌కు సీఎం వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ ను పెట్టారు. "తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.