రూపాయి కూడా భారం కాకుండా ఇల్లు నిర్మిస్తాం
అమరావతి: పేదవారికి ఒక్క రూపాయి కూడా భారం పడకుండా పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే చంద్రబాబు తన అనుచరులు, బినామీలతో కోర్టుల్లో కేసులువేయించి అడ్డుకుంటున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు అరకొరగా ఇల్లు నిర్మిస్తే..తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మిగిలిన వాటిని పూర్తి చేసిందని, ఆయన పెట్టిన బకాయిలు మా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి 365 ఎస్ఎఫ్‌టీ, 430 ఎస్ఎఫ్‌టీ ఇళ్ల లబ్ధిదారులు చెల్లించాల్సిన డబ్బుల్లో సగం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఎన్నికల ముందు, మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్లు అమలు చేస్తున్నామని, చంద్రబాబు, ఎల్లోమీడియా తప్పుడు కథనాలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణంపై సభలో జరిగిన చర్చలో సీఎం వైయస్ జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..
మంచి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ, ఎల్లో మీడియా రకరకాల కుయుక్తులు, అడ్డంకులు. దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా డిసెంబర్ 25న క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి రోజున దాదాపు 30 లక్షల 66 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇందులో ఏకంగా 17436 వైయస్ఆర్ జగనన్న కాలనీలు ప్రతి గ్రామంలో కనిపిస్తాయి. ఇన్ని లక్షల మందికి మేలు జరిగే కార్యక్రమం జరిగితే..కనీసం ఆశీర్వదించాల్సింది పోయి..ఎలా అడ్డుకోవాలని దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు. అక్షరాల 68,677 ఎకరాలు ఈ రోజు పంపిణీ చేస్తున్నాం. వీటి మార్కెట్ విలువ అక్షరాల రూ.23,530 కోట్లు విలువ చేసే స్థలాలు పేదలకు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మానవత్వంతో ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతిపక్షం అడ్డుకుంటుంది. రాష్ట్రంలో దాదాపుగా కోటి 20 లక్షల మందికి మేలు జరుగుతుంది. జనాభాలో నాలుగో వంతు మేలు జరుగుతుంది. ప్రతిపక్షం ఎలా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తోంది.
ఈ కార్యక్రమాలు చేసేందుకు 25,359 ఎకరాలకు రూ.10,150 కోట్లు వేచ్చించి కొనుగోలు చేసింది. రకరకాల పద్ధతిలో కోర్టు కేసులు వేయించారు. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన ఎల్లోమీడియా అబద్ధాలు రాయడం, వాటి ఆధారంగా కోర్టులో కేసులు వేయించడం వీళ్లే చేస్తున్నారు. చంద్రబాబు జూమ్‌లో పిలుపునిచ్చారు. కోర్టుల్లో కేసులు వేయాలని ఆయనే ఆదేశాలు జారీ చేశారు. నిజంగా మనసు తరుక్కుపోతుంది. ప్రకాశం జిల్లాలో మక్కెన శ్రీనివాస్ అనే వ్యక్తి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌నాయుడి శిష్యుడు. ఈయన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా పని చేశారు. ఇదే పెద్ద మనిషి ఇంతకు ముందు కలెక్టర్‌కు 2016లో వినతిపత్రం కూడా ఇచ్చారు. అప్పట్లో ఇదే పెద్ద మనిషి ఏమన్నారంటే..గతంలో ఇక్కడ మైనింగ్ చేయకూడదు. ఇక్కడ ట్రిపుల్ ఐటీ పెట్టాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అప్పటి ఎమ్మెల్యే జనార్ధన్ కూడా సపోర్టు చేశారు. ఇదే ప్రాంతంలో ఇల్లు ఇస్తామంటే శ్రీనివాస్ అనే వ్యక్తితో కోర్టులో కేసులు వేయించారు. స్టే ఇచ్చారు. దీన్ని వెకెట్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
మరో టీడీపీ ఎమ్మెల్యే బాలావీరాంజనేయులు కూడా ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని కోరారు. మైనింగ్‌కు కేటాయించిన భూమిలో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని మక్కెన శ్రీనివాసులు కోర్టులో వేశారు. అక్కడ మైనింగే జరగడం లేదు. దశాబ్దాలుగా ఆ భూమి ఖాళీగా ఉంది. కుట్ర పూరితంగా కోర్టులో కేసులు వేశారు. స్టేలు ఇప్పించారు.
కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు సతీష్ ఉన్నారు. ఈయన 4800 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే భూమి పోర్టు పక్కనే ఉంది. అదే భూమిలో టిడ్కో ఇళ్లు కట్టడం మొదలుపెట్టారు. అక్కడ చంద్రబాబు ఇళ్లు కట్టరు..సగంలోనే వదిలేశారు. మనమే పూర్తి చేయిస్తున్నాం. ఈ భూములు మడా భూములని సతీష్ కోర్టులో కేసు వేయించి స్టే ఇప్పించారు.
సీఆర్‌డీఏ భూములకు సంబంధించి 54 వేల మంది పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వీళ్లు కోర్టులో కేసులు వేయించారు. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇస్తే డెమగ్రఫి ఇన్‌బ్యాలెన్స్ ఏర్పడుతుందని కోర్టులో ఫైల్ చేశారు. వీటిపై కోర్టులు స్టే ఇచ్చింది. సామాన్యుడి మాటలో చెప్పాలంటే..కులాలు, వర్గాల సమీకరణలు మారిపోతాయని అర్థం. ఎస్సీలు, ఎస్టీలు వారి మధ్యకు వస్తే వర్గాలు ఏర్పడుతాయని కోర్టుల్లో కేసులు వేశారు.
ఇటీవల చంద్రబాబుకు కమ్యూనిస్టులు బాగా దొరికారు. సీపీఐ నేతలు కమ్యూనిస్టులు కాదు..కమ్యూనలిస్టులుగా మారిపోయారు. ఈయన కూడా విశాఖలో పిల్ వేశారు. విశాఖలో 5364 ఎకరాల్లో ఇళ్లు ఇస్తామంటే కేసులు వేయించారు. ల్యాండ్ పూలింగ్‌లో ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంటే..లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చే ముందుకు వారికి నచ్చిన తరువాతే సంతకాలు తీసుకోమని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. లోకనాథం అనే వ్యక్తితో విశాఖలో కోర్టులో కేసు వేశారు. చంద్రబాబు, కమ్యూనిస్టులకు మధ్య అవగాహన ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. గోగంటి సాయినాథ్‌రెడ్డి..ఈయన మాజీ మంత్రి పరిటాల సునిత అనుచరుడు. ఈయన కూడా అనంతపురంలో పిటిషన్ వేశారు. చెట్లు తీయడం లేదని కలెక్టర్ సమాధానం ఇచ్చినా కూడా కోర్టు నుంచి స్టే ఇప్పించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే సొంత పీఏ మురళీమోహన్‌రెడ్డితో కేసు వేయించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మిగిలిపోయిన భూమిని పంపిణీ చేస్తామంటే వీళ్లు కేసు వేశారు. మాజీ ఎమ్మెల్యే జనార్థన్‌రెడ్డి కేసులు వేయించి స్టే ఇప్పించారు.
జీవీ రమణ..కొత్త వలస మండలం విజయనగరం జిల్లా..గ్రేడింగ్ ల్యాండ్ అని కోర్టులో కేసు వేశారు. ఇన్నీ జరుగుతున్నా కూడా దాదాపుగా 3,65,680 ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. చంద్రబాబు ఈర్ష్య, కడుపు మంటతో వీటి పంపిణీని ఆపగలిగారు. దేవుడు ఆశీర్వదిస్తే త్వరలోనే స్టే వెకెట్ చేయిస్తాం. 8 లక్షల టిడ్కో ఇళ్లు, 4.86 మిగతా ఇళ్లు కూడా ఉన్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే..27 లక్షల ఇళ్ల స్థలాలు 30 లక్షలు అవుతాయని ఆశీస్తున్నాం. ఈ కాలనీల్లో 13 లక్షల చెట్లు కూడా నాటబోతున్నాం. 15,65 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నాం. 8494 లే అవుట్లలో మొదటి విడతలో నిర్మాణాలు ప్రారంభిస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే వాళ్ల నియోజకవర్గాల్లో ఊరూరా తిరిగి ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. 15 రోజుల్లో ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టిస్తారు.
గతంలో కట్టిన ఇళ్లకు, వీటికి మధ్య ఉన్న తేడాను వీడియో ద్వారా సభలో సీఎం వైయస్ జగన్ చూపించారు. పేదవాడికి రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే రూ.1.80 లక్షలతో ఇల్లు నిర్మిస్తాం. మంత్రి దగ్గరే ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయిస్తాం. ఆ ఇల్లు ఎంత చక్కగా ఉన్నాయో గమనించండి. నాణ్యతతో కూడిన మెటిరీయల్ కూడా అందజేస్తున్నాం. రివర్స్ టెండరింగ్ ద్వారా మెటిరీయల్ ఇప్పిస్తాం. ఇంతకంటే మంచి మెరిటీయల్ తెచ్చుకుంటామంటే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. లబ్ధిదారుడి చేతుల్లో డబ్బులు కట్టి ఇల్లు నిర్మిస్తాం. ఇసుక కూడా ఉచితంగానే అందజేస్తాం. ఇనుము, సిమెంట్, మెటల్, బ్రిక్స్ కూడా సరసమైన ధరకే ఇస్తాం. లబ్ధిదారులు ప్రభుత్వానికే అప్పగిస్తే..వారికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మేమే కట్టించి తాళాలు ఇస్తాం. లబ్ధిదారుడికి ఒక్క రూపాయి కూడా భారం కాకూడదు. గతంలో ఇల్లు 224 ఎస్ఎఫ్‌టీ లోనే ఇచ్చేవారు. మనం 340 ఎస్ఎప్‌టీ ఇల్లు కడుతున్నాం. మనం కట్టే ఇల్లు..బెడ్ రూమ్, కిచెన్, లివింగ్ రూమ్, వరండ, లెట్రిన్, బాత్‌రూమ్ కూడా ఉంటుంది. మొదటి దశలో కట్టే 15 లక్షల ఇల్లు ఎకనామిక్ యాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందంటే సిమెంట్, స్టీల్, ఇసుక, ఇతర మమెటిరీయల్, చాలా మందికి నేరుగా ఉపాధి దొరుకుతుంది.
చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్ స్కీమ్ కింద 4,56,929 , పీఎంఆర్‌వై కింద 91120 కింద, హుద్‌హుద్ సమయంలో 8815 ఇల్లు..మొత్తం కలిపి 6,3986 ఇళ్లు చంద్రబాబు నిర్మించారు. వీటికి అదనంగా అంతకంటే ముందు 476509 ఇళ్లు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 2,00,860 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. చంద్రబాబు రూ. 1410కోట్లు బకాయిలు పెట్టారు. వీటిలో రూ.410 కోట్లు బకాయిలు చెల్లించాం. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తాం.చంద్రబాబు తన హయాంలో మొదటి రెండేళ్లు ఇల్లు నిర్మించలేదు. మంజూరు చేయలేదు. చంద్రబాబు హయాంలో ఇళ్లలో ర్యాకింగ్‌లో ఏపీ 24వ స్థానంలో ఉంది.
టిడ్కోకు సంబంధించి చంద్రబాబు రకరకాలుగా మాట్లాడారు. నిజంగా చంద్రబాబు టిడ్కోకు సంబంధించిన పరిస్థితిని గమనిస్తే..
గతంలో పెండింగ్‌లో ఉన్న 2 లక్షల ఇల్లు పూర్తి చేశారు. మంజూరులో చేసిన వాటిలో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి. ఎన్ని పూర్తి అయ్యాయని గమనించాలి. 300 ఎస్ఎఫ్‌టీ ఇళ్లను కట్టాలంటే కేంద్రం ఇచ్చేది కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే..రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 లక్షలు ఇస్తుంది. లబ్ధిదారుడు మరో రూ.3 లక్షలు బ్యాంకులో తెచ్చుకోవాలి. చంద్రబాబు టపటపా మంజూరు చేశారు. నిర్మించింది మాత్రం అరకొర. చంద్రబాబు హయాంలో టీడ్కో ఇల్లు గ్రౌండ్ అయ్యింది 3.16 లక్షలు అంటున్నారు. 2.68 టిడ్కో ఇళ్ల పరిస్థితి గమనిస్తే..చంద్రబాబు హయాంలో 90 శాతం పూర్తి కావాల్సి వచ్చినవి 74 వేల ఇళ్లు అంటున్నారు. ఎక్కడా ఇన్‌ఫ్రాక్చర్ జరగలేదు. మనం వచ్చిన తరువాత ఇవన్నీ చేస్తున్నాం. డ్రైన్స్, రోడ్లు లేకపోతే ఇబ్బందులు తప్పవు. చంద్రబాబుకు ఇవన్నీ చేయాలనే ఆలోచన, తపన లేదు. రూ.3200 కోట్లు బకాయిలు చంద్రబాబు పెట్టారు. మరో 37 వేల ఇల్లు శ్లాబ్‌లు వేసి వదిలేశారు. పునాదులు కూడా దాటనవి లక్ష 20 వేల ఇళ్లు ఉన్నాయి. ఇది చంద్రబాబు హయాంలో టిడ్కోకు సంబంధించిన పురోగతి.
ఈ బకాయిలు తీర్చడమే కాకుండా మనమే రూ.1200 కోట్లు విడుదల చేశాం. ఇంకా రూ.9,500 కోట్లు అవసరం. ఈ ఏడాది కొన్ని, వచ్చే ఏడాది కొన్ని చొప్పున పూర్తి చేస్తాం. అన్ని కూడా పూర్తి చేసి లబ్ధిదారులు ఇళ్లు అందజేస్తాం. ఆశ్చర్యం ఏంటంటే..పేదవాడికి ఇల్లు తాను కట్టానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. పేదవాడికి ఎలాంటి మేలు చేయకుండా ఇలాంటి మాటలు ఎలా చెబుతారు. ఏమి చేయకుండా తానే చేశానని చంద్రబాబు చెప్పుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. లబ్ధిదారులకు అప్పులు పెట్టి 20 ఏళ్లు నెలకు రూ.3 వేలు బ్యాంకుకు చెల్లించాలంటే పేదవాడికి క్రెడిట్ ఇవ్వాలా? ..చంద్రబాబుకు క్రెడిట్ ఇవ్వాలా? గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 23 లక్షల ఇళ్లు నిర్మించింది. మేం క్రెడిట్ తీసుకోవడానికి బిల్డింగ్‌లు పూర్తి చేస్తున్నాం. పేదవాడికి ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు ఇస్తాం. ఆ పేదవాడి అప్పంతా మా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇస్తున్నాం. రూ.10,484 కోట్లు మా ప్రభుత్వం పేదవారి తరఫున చెల్లిస్తుంది. లక్ష 43 వేల మంది పేదవారికి ఇళ్లు అందజేస్తాం.
365 ఎస్ఎఫ్‌టీకి సంబందించి ఇల్లు 70 వేలు, 400ఎస్ఎఫ్‌టీ ఇళ్లు 44 వేల ఇళ్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పామో? పాదయాత్రలో ఏం చెప్పానో మళ్లీ చెబుతున్నాను. చెప్పిందే చేస్తున్నాం.ఇదొక్కటే కాదు..మిగిలిన వారికి సంబంధించి మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. 365 ఎస్ఎఫ్‌టీకి సంబంధించి రూ.50 వేలు కట్టాల్సిన అసరం ఉంది. ఇందులో రూ.25 వేలు తగ్గిస్తాం. 430 ఎస్ఎఫ్‌టీకి సంబంధించి రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.50 వేలు తగ్గిస్తాం. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వమే భారం భరిస్తుంది. ఇదే విషయంలో గతంలో చంద్రబాబు హయాంలో 2.62 లక్షల ప్లాట్లుకు సంబంధించి 64 వేల ప్లాట్లకు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాం. ఇందులో రూ.3239 రీయల్ వ్యాల్యూ వచ్చింది. రూ.2447 కోట్లకు రివరస్ టెండరింగ్‌కు ఫైనల్ అయ్యింది. అంటే 392 కోట్లు ప్రభుత్వానికి మిగిలింది. చంద్రబాబు జేబుల్లోకి ఎంత డబ్బు వెళ్లిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. చంద్రబాబు కట్టిన ప్లాట్లు కాంట్రాక్టర్ల కోసమో..లబ్ధిదారుల కోసమో గమనించాలి. వాస్తవాలను వ క్రీకరించి కోర్టుల్లో కేసులు వేయడం, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్తలు రాస్తారు. వారే వెళ్లి మళ్లీ కోర్టుకు వెళ్తారు.వాటిని తీసుకుని చంద్రబాబు ఈ రోజు సభలో చదువుతున్నారు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో గమనించాలి. చంద్రబాబు లాంటి వ్యక్తికి కనీసం దేవుడు ఇప్పటికైనా మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటూ సీఎం వైయస్ జగన్ సెలవు తీసుకున్నారు.