పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదు
26 Sep, 2019 15:00 IST
అమరావతి: పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళన, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో దేశానికి మార్గదర్శకం కావాలన్నారు. నెల రోజుల్లోగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అత్యుత్తమ విధానాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆ మేరకు అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెడతామన్నారు. విశాఖపట్నం కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. చెట్లను పెంచడంలో వాలంటీర్ల సహకారం అవసరమన్నారు. ప్రతి ఇంటికీ నాలుగు మొక్కలు నాటించాలని సూచించారు. గోదావరి జిల్లాల్లో పంట కాల్వల పరిరక్షణకు మిషన్ గోదావరి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.