లండన్‌లో జై జగన్ నినాదాలు
18 May, 2024 19:24 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్.. శనివారం అక్కడకు చేరుకున్నారు.
సీఎం వైయస్ జగన్ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం వైయస్ జగన్ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం వైయస్ జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మళ్లీ రాష్ట్రానికి తిరిగి రానున్నారు సీఎం వైయస్ జగన్. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం వైయస్ జగన్ రాష్ట్రానికి వస్తారు.