వైయస్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం వైయస్ జగన్
6 Dec, 2022 11:55 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్ఆర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. కడప అమీన్‌పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. రేపటి నుంచి పెద్ద దర్గా ఉత్సవాలు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్‌ను సీఎం వైయస్ జగన్ సమర్పించనున్నారు.
అనంతరం దర్గా నుంచి రోడ్డు మార్గాన రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ 12.45 గంటల వరకు తమ సమీప బంధువు, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని 1.30 గంటలకు బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.