ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
3 Dec, 2020 12:28 IST
అసెంబ్లీ: నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ.. శాసనసభ సభను తప్పుదోవ పట్టిస్తున్నావని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూరక్వంగా సభను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్పీకర్‌ను సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యుడు రామానాయుడుకి సభలో మాట్లాడే అర్హత లేదని, ప్రతిపక్ష సభ్యుడిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవాల ఆధారంగా రామానాయుడుపై చర్య తీసుకుంటామని స్పీకర్ సభలో ప్రకటించారు. సభలో వాస్తవాలు చెప్పాలని సభ్యులకు సూచించారు. రామానాయుడు వ్యాఖ్యలను శాసనసభ రికార్డ్ నుంచి తొలగించాలని ఆదేశించారు.