మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. సీఎం వైయ‌స్ జగన్‌ హర్షం

9 Feb, 2024 14:31 IST

 తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మాజీ ప్ర‌ధాని పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ,  నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించటం  తెలుగు ప్రజలందరికీ గౌరవం. రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రదానం చేయడం యావత్ జాతి గర్వించదగ్గ విషయం అని సీఎం వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.