పోలవరం చేరుకున్న సీఎం వైయస్ జగన్
పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం చేరుకున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం కొద్దిసేపటి క్రితమే పోలవరం చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేసిన సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైయస్ఆర్ సీపీ నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించనున్నారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులతో పాటు డ్యామ్ నిర్మాణ పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వైయస్ జగన్.. గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.25 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందచేసే దిశగా వైయస్ జగన్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది.