మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

6 Sep, 2019 11:57 IST

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఉద్ధానం ప్రజల కోసం పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేసే పథకానికి, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశౄరు. మధ్యాహ్నంఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురం లిప్ రాజీవ్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. ఆ తర్వాత సింగుపురంలో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.