డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోన రఘుపతికి సీఎం అభినందనలు
18 Jun, 2019 13:16 IST
వెలగపూడి: శాసనసభ ఉప సభాపతిగా ఎన్నిక కోన రఘుపతిని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. మంచి స్పీకర్‌గా రాణిస్తారని సంపూర్ణంగా విశ్వసించి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుఫున కలిసికట్టుగా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకున్నామని, డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నామన్నారు. సభలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. మీ తండ్రి కోన ప్రభాకర్ మంత్రిగా, స్పీకర్‌గా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసి ఖ్యాతి సంపాదించారన్నారు. మంచి చేస్తారని, ప్రతిపక్షానికి కూడా మాట్లాడేందుకు మంచి అవకాశాలు ఇస్తారని, ప్రతిపక్షం తరుఫున కూడా కోరుకుంటూ.. మీ నాన్న కోన ప్రభాకర్ మాదిరిగానే పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ అభినందిస్తున్నానన్నారు.