ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం

4 Jan, 2022 12:59 IST

న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు కేంద్రమంత్రితో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్య, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రితో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు.