కేంద్రమంత్రులతో సీఎం వైయస్ జగన్ భేటీ
ఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై, ఏపీకి దక్కాల్సిన హక్కులు, నిధులపై పలువురు కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. తొలత కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయిన సీఎం వైయస్ జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని కేంద్రమంత్రికి సీఎం వైయస్ జగన్ వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. సీఎం వైయస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, మిథున్‌రెడ్డి, బాలశౌరి, వైయస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నతారు. మరి కాసేపట్లో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సీఎం వైయస్ జగన్ భేటీకానున్నారు.