పారిశ్రామికవేత్తలతో సీఎం వైయస్ జగన్ భేటీ
24 May, 2022 16:22 IST
దావోస్: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తొలుత కాంగ్రెస్ సెంటర్‌లో సెకోయ క్యాపిటల్ ఎండీ రంజన్ ఆనందన్‌తో భేటీ అయిన సీఎం వైయస్ జగన్.. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రెమంట్‌తో సమావేశమయ్యారు. అదే విధంగా ఏపీ పెవిలియన్‌లో జుబిలియంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కాళీదాస్ హరి భర్తియాతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలకు సంబంధించిన సమాచారం అందజేశారు.