కేంద్ర న్యాయశాఖ మంత్రితో సీఎం వైయస్ జగన్ భేటీ
15 Feb, 2020 12:40 IST
ఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, శాసనసమండలి రద్దు అంశాలను సీఎం వైయస్ జగన్ కేంద్ర న్యాయశాఖ మంత్రితో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంట వైయస్ఆర్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వైయస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాలశౌరి తదితరులు ఉన్నారు.