ముస్లిం సంఘాల ప్రతినిధులతో సీఎం వైయస్ జగన్ సమావేశం
13 Mar, 2023 15:38 IST
తాడేపల్లి: ముస్లిం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ భాషా, ముస్లిం సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీలకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సీఎం వైయస్ జగన్‌ను ఘనంగా సత్కరించారు.