గవర్నర్‌కు సీఎం వైయస్ జగన్ పరామర్శ
15 Dec, 2021 18:56 IST
విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పరామర్శించారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న గవర్నర్.. హైదరాబాద్‌లో చికిత్స అనంతరం విజయవాడకు చేరకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ గవర్నర్ దంపతులను కలిసి వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ గవర్నర్‌కు సూచించారు.