అమిత్‌షాతో ముగిసిన సీఎం వైయస్ జగన్ భేటీ
17 Mar, 2023 15:11 IST
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌షాతో చర్చించారు. ఈ మేరకు సీఎం వినతి పత్రం అందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వైయస్ జగన్ ఇవాళ ఉదయం పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన విషయం విధితమే.