కార్మికుల సంక్షేమం మన ప్రభుత్వ లక్ష్యం
1 May, 2023 12:02 IST
తాడేపల్లి: కార్మిక సోదరులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. ``కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం. మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం. నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు. కార్మికుల సంక్షేమం మన ప్రభుత్వ లక్ష్యం!`` అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.