ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
18 Feb, 2023 13:36 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను`` అని సీఎం ట్వీట్ చేశారు.