పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
కడప: పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. రూ.5 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.3115 కోట్లతో గండికోట–సీబీఆర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్ స్కీంకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌కు, రూ.34 కోట్లతో పులివెందులలో నూతన ఆర్టీసీ బస్టాండ్, డీపోల నిర్మాణానికి, రూ.36 కోట్లతో తొండూరు బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు, రూ.46 కోట్లతో పాడా పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు, రూ.184 కోట్లతో మల్టీ కెనెక్టివిటీ బిటి రోడ్స్‌కు, రూ.14.5 కోట్లతో గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు, రూ.180 కోట్లతో పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులకు, 4 మోడల్ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణానికి, ఏపీ క్లార్‌లో ఐఆర్‌ఎంఏ ఏపీకి, అపాచీ లెదర్ డెవలప్‌మెంట్ పార్కుకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు. ∙