కాసేపట్లో ‘జగనన్న విద్యా కానుక’ ప్రారంభం

8 Oct, 2020 10:16 IST

తాడేపల్లి: కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ వేదికగా ‘‘జగనన్న విద్యా కానుక’’ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కాసేపట్లో కృష్ణా జిల్లా పునాదిపాడుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బయల్దేరనున్నారు. పునాదిపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నాడు–నేడు పనులను పరిశీలించనున్నారు. అనంతరం ‘‘జగనన్న విద్యా కానుక’’ ప‌థ‌కాన్ని లాంఛ‌నంగా ప్రారంభించి విద్యార్థుల‌కు కిట్లను అందించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థులు విద్యా కానుక కిట్లు అందుకోనున్నారు. కిట్‌లో స్కూల్‌ బ్యాగ్, 3 జతల యూనిఫామ్స్, ఒక జత షూ, 2 జతల సాక్సులు, బెల్ట్, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌తో పాటు ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా వర్క్‌బుక్స్‌ను ప్రభుత్వం విద్యార్థులకు అందించనుంది. యూనిఫామ్స్‌ కుట్టుకూలీ కూడా తల్లుల అకౌంట్‌లో జమ చేయనుంది. జగనన్న విద్యా కానుక కోసం రూ.650 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.