నాన్నలో ఉన్న గొప్పతనాన్ని అమ్మ ఆవిష్కరించారు
8 Jul, 2020 11:17 IST
ఇడుపులపాయ: నాన్న దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిలో ఉన్న గొప్పతనాన్ని అమ్మ `నాలో..నాతో అన్న పుస్తకం ద్వారా ఆవిష్కరించారని ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద వైయస్ విజయమ్మ రచించిన నాలో..నాతో పుస్తకాన్ని సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ..గొప్ప రాజకీయ నేతగా అందరికీ పరిచయం అయిన వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు.నాన్నను చూసిన విధంగా ..నాలో..నాతో వైయస్ఆర్ పుస్తకాన్ని అమ్మ రచించారన్నారు.నాన్న జయంతిని పురస్కరించుకొని అమ్మ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.