ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
17 Dec, 2021 17:48 IST
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. విశాఖలో రూ.150 కోట్లతో నిర్మించిన ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ను సీఎం వైయస్ జగన్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. చిన్నముసిడివాడలో రూ.5.14 కోట్లతో కల్యాణ మండపం, తాటిచెట్లపాలెం ధర్మానగర్‌లో రూ.1.56 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి తదితర అభివృద్ధి పనులను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు.