ఈనెల 16న కర్నూలుకు సీఎం వైయస్ జగన్
కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 16న సీఎం కర్నూలులో పర్యటించనున్నారు. పత్తికొండ నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌రెడ్డి కుమారుడు వివాహానికి సీఎం వైయస్ జగన్ హాజరవ్వనున్నారు. సీఎం వైయస్ జగన్ ఈనెల 16న కర్నూలు చేరుకుని కృష్ణానగర్‌లో ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవి నివాసంలో నూతన వధూవరులను ఆశీర్వదించునున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు.
సీఎం పర్యటన ఇలా..
- ఈనెల 16వ తేదీ ఉదయం 10.40 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- 10.50 గంటలకు హెలికాప్టర్‌లో కర్నూలు ఏపీఎస్‌పీ బెటాలియన్‌లోని హెలిపాడ్‌కు చేరుకుంటారు.
- 11.10 గంటలకు కర్నూలులోని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నివాసానికి రోడ్డు మార్గంలో బయల్దేరుతారు.
- 11.20 గటంలకు ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని 11.35 గంటల వరకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పెళ్లి వేడుకలో పాల్గొంటారు.
- 11.45 గంటలకు ఏపీఎస్‌పీ బెటాలియన్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు.
- 12.05 గంటలకు ఓర్వకల్లు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.