వరద వచ్చినప్పుడే ఒడిసిపట్టాలి

12 Sep, 2019 14:56 IST

అమరావతి: వరద వచ్చినప్పుడే ఒడిసిపట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. గురువారం జలవనరుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. సముద్రంలోకి నీళ్లు వెళ్లకముందే కృష్ణా వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలన్నారు.ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. 120 రోజుల వరద వస్తుందనే లెక్కలను సవరించాలని సూచించారు. ఈ సీజన్‌లో వరద వచ్చినా ప్రాజెక్టులను నింపడానికి చాలా సమయం పడుతుందన్నారు. అతి తక్కువ సమయంలో భారీగా వరద వచ్చిందని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిండి వరద జలాలు సముద్రంలోకి వెళ్లాయని, దేవుడి దయవల్ల రెండోసారి వరద వచ్చిందన్నారు.  ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా కూడా సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.