రెండోరోజు వైయస్ఆర్ జిల్లాలో సీఎం పర్యటన
10 Nov, 2023 10:42 IST
వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్ఆర్ కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు పర్యటనలో భాగంగా ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్‌ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి అక్కడి సిబ్బందిని పరిచయం చేసుకొని ఫొటో దిగారు. అనంతరం ఎకో పార్కు వద్ద వేముల మండలం నాయకులు, ప్రజలతో సీఎం వైయస్ జగన్ సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం హెలికాప్టర్‌లో కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. కడప నుంచి బయల్దేరి మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.