లక్కసాగరం పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
19 Sep, 2023 11:31 IST
కర్నూలు: కరువు నేలను సస్యశ్యామలం చేస్తూ రూ.224 కోట్లతో నిర్మించిన లక్కసాగరం పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద నిర్మించిన లక్కసాగరం పంప్‌హౌస్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ పంప్‌హౌస్ ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి సాగు, తాగునీరు సరఫరా కానున్నాయి. దీని ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 77 చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. 10,394 ఎకరాలకు సాగునీరు అందనుంది. మరికాసేపట్లో డోన్‌లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.