పులివెందుల మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం
24 Dec, 2021 18:36 IST
వైయస్ఆర్ జిల్లా: పులివెందులలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మోడల్ పోలీస్ స్టేషన్‌ను సీఎం ప్రారంభించారు. స్టేషన్‌లోని రిసప్షన్, గదులు, మీటింగ్ హాల్, పరిసర ప్రాంతాలను సీఎం పరిశీలించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. విజిటర్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి.. స్టేషన్ సిబ్బందికి `ఆల్ ది బెస్ట్` తెలిపారు.