‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పైలాన్ ఆవిష్కరించిన సీఎం
25 Dec, 2020 13:56 IST
తూర్పుగోదావరి: యు.కొత్తపల్లి మండలం, కొమరగిరి గ్రామంలో నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు.. ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ, వైయస్‌ఆర్ జగనన్న కాలనీ శంకుస్థాపన పైలాన్‌ను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు కొమరగిరిలో వైయస్‌ఆర్ జగనన్న కాలనీలో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం పరిశీలించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ సభా వేదికకు సీఎం చేరుకున్నారు.