2న ఇడుపులపాయకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

29 Aug, 2019 09:24 IST

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సెప్టెంబర్‌ 2వ తేదీన వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదో వర్థంతిని పురస్కరించుకుని ఆయన విజయవాడలో సోమవారం ఉదయం బయల్దేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్‌ సమాధి వద్ద వర్థంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని అదే రోజు సాయంత్రానికి విజయవాడకు తిరిగి వస్తారని అధికార వర్గాలు తెలిపాయి.