మార్కెట్‌ యార్డు కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు

3 Oct, 2019 14:32 IST


తాడేపల్లి: మార్కెట్‌ యార్డులకు వెంటనే కమిటీల నియామయం జరపాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కమిటీలలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని సూచించారు. గురువారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్‌, సహకార శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. పంట ప్రారంభంలోనే మద్దతు ధర ప్రకటించాలని ఆదేశించారు. అక్టోబర్‌ చివరి వారంలోగా పప్పు ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. నియోజకవర్గాల స్థాయిలో గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అన్ని పంటలకు ఈనామ్‌ అమలు చేయాలన్నారు. ఆరు నెలల్లో దళారి వ్యవస్థను రూపుమాపాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.