కుతూహలమ్మ మృతి పట్ల సీఎం వైయస్ జగన్ సంతాపం
15 Feb, 2023 11:48 IST

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ జి. కుతూహలమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గుమ్మడి కుతూహలమ్మ తిరుపతిలోని ఆమె నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ కోలుకోలేక కన్నుమూశారు.