మంచి పనులకు విఘ్నాలు తొలగాలి
10 Sep, 2021 11:06 IST
తాడేపల్లి: వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, అందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని అభిలషించారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.