ఇంటింటా... శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి
20 Feb, 2020 17:05 IST
అమరావతి : రాష్ట్రంలోని పంచారామాలు, శక్తి పీఠాలు, శివాలయాలు, ఇంటింటా... శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.