ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం ఘన స్వాగతం
22 Feb, 2023 21:12 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఘనస్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఏపీ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. పోలీసు గౌరవవందనం స్వీకరించిన అనంతరం నూతన గవర్నర్ జస్టిస్ నజీర్ దంపతులు రాజ్‌భవన్ చేరుకున్నారు.