కడప బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

28 Mar, 2021 15:49 IST

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ జిల్లా కడపకు బయల్దేరారు. అనారోగ్యంతో కన్నుమూసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య  కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి కడపకు బయల్దేరారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కడప నగరంలోని కో–ఆపరేటీవ్‌ సొసైటీ కాలనీలో ఉన్న వెంకట సుబ్బయ్య నివాసానికి సీఎం చేరుకుంటారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పరామర్శ అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.