విశాఖపట్నం బయల్దేరిన సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటనకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. విశాఖ చేరుకున్న అనంతరం ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్‌తో పాటు వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసిన మరో 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు. సాయంత్రం విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ధి చేసిన మరో 4 ప్రాజెక్ట్‌లను సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారు. 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరానికి సీఎం వైయస్ జగన్ తిరుగు ప్రయాణమవుతారు.