రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన సీఎం
7 Feb, 2021 12:49 IST
చిత్తూరు: మదనపల్లెలోని చిప్పిలికి చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. సీఎం వైయస్ జగన్ వెంట మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. మదనపల్లెలోని సత్సంగ్ ఫౌండేషన్, పీపుల్ గ్రోవ్ స్కూల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందర్శించనున్నారు. సత్సంగ్ ఫౌండేషన్‌లో మొక్కలు నాటనున్నారు. అదే విధంగా సదుంలోని పీపుల్ గ్రోవ్ స్కూల్‌లో మొక్కలు నాటి.. విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అంతేకాకుండా భారత్ యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. స్వాస్థ్య ఆస్పత్రి నూతన భవనానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భూమిపూజ చేస్తారు.