బిపిన్ రావత్ మృతి పట్ల సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
               9 Dec, 2021 09:55 IST            
                      
తాడేపల్లి: బిపిన్ రావత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలిన సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాద ఘటన వార్తతో కలత చెందానన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.