రేపు సీఎం వైయస్ జగన్... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన
6 Jun, 2023 15:45 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ హాజరుకానున్నారు.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకుంటారు. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.