సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా
2 Jun, 2020 12:10 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, పోలవరం నిధుల గురించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో చర్చించాలని సీఎం వైయస్ జగన్ భావించారు. షెడ్యుల్ ప్రకారం తాడేపల్లి నుంచి ఈరోజు ఉదయం సీఎం ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉండగా, ఈ పర్యటన వాయిదా పడింది.