నిర్మల్ హృదయ్భవన్ను సందర్శించిన సీఎం దంపతులు
30 May, 2023 11:00 IST
విజయవాడ: మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్భవన్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దంపతులు సందర్శించారు. నిర్మల్ హృదయ్లో నూతనంగా నిర్మించిన హోమ్ ఫర్ సిక్ అండ్ డైయింగ్ డెస్టిట్యూట్స్ భవనాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. విజయవాడ నగరంలోని రాఘవయ్య పార్కు సమీపంలోని నిర్మల్ హృదయ్భవన్కు చేరుకున్న సీఎం వైయస్ జగన్, వైయస్ భారతీ దంపతులకు నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆశ్రమంలోని మదర్ థెరిస్సా చిత్రపటానికి సీఎం వైయస్ జగన్ దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మల్ హృదయ్భవన్లోని అనాథ పిల్లలు, వృద్ధులతో ముఖ్యమంత్రి దంపతులు ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అనంతరం అనాథ పిల్లలు, వృద్ధులతో ఫొటోలు దిగారు.