తిరుప‌తి, బాప‌ట్ల జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

8 Dec, 2023 10:43 IST

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటనకు బయల్దేరారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న నిమిత్తం తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్తారు. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకుంటారు. వ‌ర‌ద‌ బాధితులతో మాట్లాడనున్నారు. తర్వాత కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. అనంత‌రం బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమావేశం కానున్నారు.